News February 24, 2025

రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి

image

AP: ఏపీజెన్కో గతంలో ఎన్నడూ లేనంతగా నిన్న 241.523 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి చేసింది. విజయవాడ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(VTPS) స్థాపించిన తర్వాత నిన్న సాధించిన 52.73MU విద్యుత్ ఉత్పత్తే అధికం. ఇతర థర్మల్ కేంద్రాల్లో 123.055MU, హైడల్ 9.411MU, తదితరాల ద్వారా మిగతా విద్యుత్ జనరేట్ అయింది. ఏపీజెన్కో చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం అని సంస్థ MD కేవీఎస్ చక్రధరబాబు తెలిపారు.

Similar News

News March 22, 2025

అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రంలో నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు రూ.1000 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ‘అడ్వకేట్లు, గుమాస్తాల సంక్షేమ చట్టం సవరణ బిల్లు-2025’ను శాసనమండలిలో ప్రవేశపెట్టారు. నూతన హైకోర్టుతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణానికి రూ.2,600 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. అడ్వకేట్లు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులతో పాటు ప్రమాద బీమా కల్పిస్తామని చెప్పారు.

News March 22, 2025

డీలిమిటేషన్‌తో ఉత్తరాది డామినేషన్: కేటీఆర్

image

TG: డీలిమిటేషన్‌కు బీఆర్ఎస్ వ్యతిరేకమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తమిళనాడులో అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఉత్తరాది డామినేషన్ పెరుగుతుందన్నారు. బీజేపీ చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదని విమర్శించారు.

News March 22, 2025

బీఆర్ఎస్ పార్టీని వీడను: మల్లారెడ్డి

image

TG: తాను కాంగ్రెస్‌లో చేరుతానని జరుగుతున్న ప్రచారంపై BRS ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తాను పార్టీని వీడట్లేదని తెలిపారు. అభివృద్ధి, మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలే పరేషాన్‌లో ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీకి తమ కుటుంబం నుంచి నలుగురు సిద్ధమన్నారు. జమిలి ఎన్నికలు వస్తే ఎంపీగా పోటీ చేస్తానన్నారు.

error: Content is protected !!