News October 5, 2024
RECORD: $700 బిలియన్లు దాటిన విదేశీ మారకనిల్వలు

భారత విదేశీ మారకనిల్వలు వరుసగా ఏడోవారం పెరిగాయి. సెప్టెంబర్ 27తో ముగిసిన వారంలో నిల్వలు $12.59 బిలియన్లు పెరిగి కొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి $704.88 బిలియన్లకు చేరుకున్నాయి. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత ఈస్థాయి నిల్వలను కలిగిన నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ రికార్డు సృష్టించింది. ఒక వారంలో $12.59 బిలియన్లు పెరగడమూ ఇదే తొలిసారి.
Similar News
News February 9, 2026
నలుగురు లెక్చరర్లు.. రూ.4 లక్షల జీతం.. ఒక్కరే విద్యార్థి

AP: విద్యావ్యవస్థలో సరైన ప్రణాళిక, ముందుచూపు, కార్యాచరణ లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిపే ఘటన ఇది. ఏలూరు(D) ముసునూరు ZP స్కూల్‌లో ఏర్పాటైన జూనియర్ కాలేజీలో ప్రస్తుతం ఒక్క విద్యార్థి ఉండగా, పాఠాలు చెప్పడానికి నలుగురు లెక్చరర్లు ఉన్నారు. వీరికి ప్రతినెలా ₹4L జీతం చెల్లిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, వెంటనే చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News February 9, 2026
నరదిష్టి నివారణ పూజ

విజయప్రాప్తి, సకల శుభాలు కలగాలంటే నరదిష్టి నివారణ పూజ ఎంతో ప్రయోజనకరం. ఈ పూజతో ఇతరుల అసూయ, నెగటివ్ ఎనర్జీ, దిష్టి దోషాల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ శాస్త్రోక్త పూజతో అనారోగ్యాలు తొలగి, మానసిక శాంతి, ఆర్థికాభివృద్ధి, కుటుంబ రక్షణ చేకూరుతాయి. మీ పేరు, గోత్రంతో నిర్వహించే ఈ పూజ పూర్తి వీడియో రికార్డ్‌ను మీ వాట్సాప్‌కు పంపిస్తాము. ఆటంకాలను తొలగించుకోవడానికి వేదమందిర్‌లో ఇప్పుడే పూజ <
News February 9, 2026
T20 WC: అత్యధిక వికెట్లు తీసింది వీరే..

T20WCలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్(50) తొలి స్థానంలో ఉన్నారు. నిన్న ఐర్లాండ్‌తో మ్యాచులో 3 వికెట్లు తీసిన హసరంగ(40*) తర్వాతి స్థానంలో ఉన్నారు. అఫ్రీది(39), మలింగ(38), రషీద్(38*), జంపా(36), అజ్మల్(36), సౌథీ(36), నోర్ట్జే(35), మెండిస్(35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి అశ్విన్(32), అర్ష్‌దీప్(29), బుమ్రా(26) టాప్ వికెట్ టేకర్లుగా ఉన్నారు.


