News December 8, 2024
యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం
TG: కార్తీకమాసంలో ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, హుండీల ద్వారా యాదగిరిగుట్టకు రికార్డ్ స్థాయి ఆదాయం వచ్చింది. ఒక్క నెలలో రూ.18.03కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు. గతేడాది ఇదే మాసంలో రూ.15.08 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆలయం విమాన గోపురం బంగారు తాపడం కోసం రూ.25.52లక్షలు వచ్చినట్లు అధికారి వివరించారు.
Similar News
News January 15, 2025
బంగ్లాదేశ్‌లో కంగనా ‘ఎమర్జెన్సీ’ బ్యాన్!
కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలను బంగ్లాదేశ్‌లో బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సరిహద్దు విషయంపై భారత్, బంగ్లా మధ్య వివాదం చెలరేగింది. ఈక్రమంలోనే ఎమర్జెన్సీపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఇంతకుముందు పుష్ప-2, భూల్ భులయ్యా-3 సినిమాలను కూడా బంగ్లా ప్రభుత్వం నిషేధించింది. కాగా ఈనెల 17న ఎమర్జెన్సీ విడుదల కానుంది.
News January 15, 2025
యూపీలో తెలంగాణ బస్సుకు అగ్నిప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో 50 మంది TGలోని భైంసా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో పల్సికి చెందిన ప్రయాణికుడు మరణించాడు. మిగతావారు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో బస్సుతో పాటు ప్రయాణికుల సామాగ్రి దగ్ధమైంది. వీరంతా కాశీకి వెళ్తున్నట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
News January 15, 2025
రేపు కనుమ.. ప్రత్యేకతలు ఇవే!
3 రోజుల సంక్రాంతి వేడుకల్లో రేపు కీలకమైన కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను ఈ రోజున అలంకరించి పూజించడం ఆనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమనాడు మినప వడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరి. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి. అందుకే పండక్కి వచ్చిన వారు రేపు తిరుగు ప్రయాణం చేయకూడదంటారు. 3 రోజులు పండుగను ఆస్వాదించిన తర్వాతే తిరిగెళ్లాలనేది సంప్రదాయం.