News May 25, 2024
కశ్మీర్ లోయలో రికార్డు పోలింగ్

కశ్మీర్ లోయలో పోలింగ్‌కు ఓటర్లు పోటెత్తారు. గత 35 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంత్‌నాగ్-రాజౌరీ పార్లమెంటు నియోజకవర్గంలో 51.35% ఓటింగ్(సా.5గంటల వరకు) నమోదైనట్లు EC అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కశ్మీర్‌లోని మూడు స్థానాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా శ్రీనగర్‌లో 38.49శాతం, బారాముల్లాలో 59.1% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే. 2019లో ఈ మూడు చోట్ల సగటున 19.16శాతం పోలింగ్ నమోదైంది.
Similar News
News March 17, 2026
అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.
News March 17, 2026
విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.