News September 3, 2024
ఆ రెండు రోజులు రికార్డుస్థాయి వర్షం..
AP: ఆగస్టు 30, 31 తేదీల్లో గుంటూరు, పల్నాడు, కృష్ణా, NTR, ఏలూరు జిల్లాల్లో రికార్డుస్థాయి వర్షం కురిసిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణం కంటే అనేక రెట్లు ఎక్కువ వాన పడిందంటున్నారు. గుంటూరు జిల్లాలో 314mm, కృష్ణాలో 214mm, NTR జిల్లాలో 265mm, పల్నాడులో 200mm, ఏలూరులో 151mm వర్షపాతం నమోదైందని తెలిపారు. AUG నెలంతా అమరావతిలో 292mm వర్షం పడితే.. ఆ 2 రోజుల్లోనే 131mm కురిసిందని పేర్కొంటున్నారు.
Similar News
News September 19, 2024
జమిలి ఎన్నికలపై పార్టీల స్టాండ్ ఏంటి?
జమిలి ఎన్నికలపై రాంనాథ్ కోవింద్ ప్యానెల్ 62 పార్టీల అభిప్రాయాలను కోరగా 47 పార్టీలే స్పందించాయి. అందులో 32 అనుకూలంగా, 15 పార్టీలు వ్యతిరేకంగా స్పందించాయి. బీజేపీ, NPP, అన్నాడీఎంకే, అప్నాదళ్, అసోం గణ పరిషత్, బిజూ జనతాదళ్, శివసేన, శిరోమణి అకాలీదళ్ తదితర పార్టీలు మద్దతిచ్చాయి. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, బీఎస్పీ, సీపీఎం, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వ్యతిరేకించాయి. టీడీపీ, వైసీపీ, BRS స్పందించలేదు.
News September 19, 2024
దేశీయ స్టాక్ మార్కెట్లకు ‘ఫెడ్’ బూస్ట్
US ఫెడ్ వడ్డీ రేట్ల కోతతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ప్రీ ఓపెన్ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 419 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ఆరంభించాయి. ఎనర్జీ, మోటార్, ఫైనాన్స్ రంగ షేర్లు లాభాలతో ఓపెన్ అయ్యాయి. ఐటీ, స్టీల్ రంగ షేర్లు నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి.
News September 19, 2024
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.