News December 2, 2024
రికార్డు సృష్టించిన తెలంగాణ చెస్ మాస్టర్
క్లాసికల్ చెస్‌లో 2800 ELO రేటింగ్ సాధించిన రెండో భారత ప్లేయర్‌గా అర్జున్ ఎరిగైసి రికార్డు సృష్టించారు. చెస్ చరిత్రలో ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన 16వ ప్లేయర్‌గా నిలిచారు. అతని కంటే ముందు ఇండియన్ చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ఈ ఘనతను అందుకున్నారు. అర్జున్ రేటింగ్ ప్రస్తుతం 2801గా ఉంది. WGLకు చెందిన అతను ప్రస్తుతం భారత నం.1 ప్లేయర్‌గా కొనసాగుతున్నారు. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉన్నారు.
Similar News
News January 25, 2025
పొగమంచు వల్లే స్పిన్ ఆడటం కష్టమైంది: బ్రూక్
కోల్‌కతాలో జరిగిన తొలి T20లో ENG బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ఆడటంలో తడబడ్డారు. దీనికి పొగమంచే కారణమని ఆ జట్టు VC బ్రూక్ తెలిపారు. ‘చక్రవర్తి చాలా మంచి బౌలర్. పొగ మంచు వల్ల అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం మరింత కష్టమైంది. చెన్నైలో అలాంటి సమస్య ఉండదని అనుకుంటున్నా. T20 క్రికెట్‌లో అత్యంత కష్టతరమైనది స్పిన్ బౌలింగ్‌ను ఆడటమే. నేను మిడిలార్డర్‌లో వస్తాను కాబట్టి తొలి బంతి నుంచే స్పిన్‌ను ఆడాలి’ అని చెప్పారు.
News January 25, 2025
జనవరి 25: చరిత్రలో ఈ రోజు
1918: రష్యన్ సామ్రాజ్యం నుంచి “సోవియట్ యూనియన్” ఏర్పాటు
1969: సినీ నటి ఊర్వశి జననం
1971: 18వ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు
✰ జాతీయ పర్యాటక దినోత్సవం
✰ ఇంటర్నేషనల్ ఎక్సైజ్ దినోత్సవం
✰ జాతీయ ఓటర్ల దినోత్సవం
News January 25, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.