News August 20, 2024

రికార్డు సృష్టించిన TGSRTC

image

TG: రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలున్నట్లు తెలిపారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో రూ.32కోట్లు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయని చెప్పారు. RTC చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు వెల్లడించారు.

Similar News

News November 21, 2025

మిస్‌ యూనివర్స్‌-2025 ఫాతిమా బాష్‌ గురించి తెలుసా?

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.

News November 21, 2025

పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఇదే: వైద్యులు

image

పిల్లల్ని కనడానికి ఏ వయసు ఉత్తమమో వైద్యులు సూచించారు. ‘ఆరోగ్యకరమైన గర్భధారణ, బిడ్డ కోసం స్త్రీల ఏజ్ 20-30 మధ్య ఉండాలి. 35 తర్వాత గర్భధారణ డౌన్ సిండ్రోమ్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. పురుషులకు 25-35 ఏళ్లు ఉత్తమం. 40ఏళ్ల తర్వాత పుట్టేబిడ్డల్లో ఆటిజం, జన్యు సమస్యల ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఏజ్ 35 కంటే తక్కువ ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి’ అని చెబుతున్నారు.

News November 21, 2025

రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

image

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్‌ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.