News August 20, 2024
రికార్డు సృష్టించిన TGSRTC
TG: రక్షాబంధన్ రోజు RTCలో 63 లక్షల మంది ప్రయాణించినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇందులో 41.74 లక్షల మంది మహిళలున్నట్లు తెలిపారు. దీనిద్వారా రికార్డు స్థాయిలో రూ.32కోట్లు రాబడి వచ్చిందన్నారు. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు, టికెట్ల ద్వారా రూ.15 కోట్లు వచ్చాయని చెప్పారు. RTC చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డని, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన సేవలు అందించినట్లు వెల్లడించారు.
Similar News
News September 11, 2024
భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి కానుందా?
TG: చెరువులు, నాలాలకు సమీపంలో భవనాల నిర్మాణాలకు ‘హైడ్రా’ అనుమతి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. హైడ్రా నుంచి NOC ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా నిబంధనలను సవరించనున్నట్లు సమాచారం. ఒకవేళ అక్రమంగా నిర్మిస్తే ఇంటి నంబర్, నల్లా, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరని అధికార వర్గాలు చెబుతున్నాయి.
News September 11, 2024
విశాఖకు మరో వందేభారత్
విశాఖ నుంచి ఇప్పటికే మూడు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా SEP 15 నుంచి మరొకటి అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి దుర్గ్(ఛత్తీస్‌గఢ్)కు గురువారాలు మినహా ప్రతిరోజు ఈ సర్వీస్ నడుస్తుంది. ఉ.6 గంటలకు దుర్గ్‌లో బయల్దేరి రాయ్‌పూర్, మహాసముంద్, రాయగడ, విజయనగరం మీదుగా మ.1.55 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మ.2.55 గం.కు బయల్దేరి రా.10.50 గం.కు దుర్గ్ చేరుకుంటుంది.
News September 11, 2024
సీఎం రేవంత్ సొంత గ్రామంలో సౌర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు
TG: సీఎం రేవంత్ సొంత గ్రామం నాగర్ కర్నూల్(D) కొండారెడ్డిపల్లితో పాటు ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా సౌరవిద్యుత్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని TGSPDCL CMD వెల్లడించారు. కొండారెడ్డిపల్లిలో సర్వే చేశామని, త్వరలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు ఉచిత సౌర విద్యుత్ పంపుసెట్లు పంపిణీ చేస్తామన్నారు. పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అయితే ప్రతి పల్లెలో దీనిని అమలు చేయనున్నట్లు తెలిపారు.