News April 11, 2024
మూడు నెలల్లో 3 గాయాల నుంచి కోలుకున్నా: సూర్యకుమార్

మూడు నెలల్లో 3 గాయాలతో పోరాడినట్లు ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా, చీలమండ, కుడి మోకాలికి గాయాలైనట్లు తెలిపారు. ఒక్కో గాయం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. ఎన్సీఏలో ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడ్డాయన్నారు. ఢిల్లీతో మ్యాచులో ఎంట్రీ ఇచ్చిన సూర్య డకౌటైన సంగతి తెలిసిందే.
Similar News
News December 21, 2025
అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందనే భయంతో..: సీఎం

TG: కేసీఆర్ తన కొడుకు కోసమే బయటికి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ చస్తే హరీశ్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. అల్లుడి చేతుల్లోకి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికపరంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. అన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదు’ అని చిట్‌చాట్‌లో విమర్శించారు.
News December 21, 2025
రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం.. హాజరైన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో జరిగిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు.
News December 21, 2025
పైరేటెడ్ మూవీ యాప్స్‌తో జాగ్రత్త: MHA హెచ్చరిక

ఫ్రీ సినిమాల కోసం పర్సనల్ డేటా, సెక్యూరిటీని రిస్క్‌లో పెట్టుకోవద్దని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫ్ఫైర్స్ హెచ్చరించింది. తెలియని యాప్స్‌లో లభించే పైరేటెడ్ కంటెంట్ చూస్తే సైబర్ రిస్క్, లీగల్ ఇబ్బందులు ఎదురుకావొచ్చని చెప్పింది. లక్షల మంది వాడుతున్న ‘Pikashow App’ కూడా సురక్షితం కాదని తెలిపింది. ఈ యాప్స్‌తో మొబైల్‌లోకి వచ్చే మాల్వేర్, స్పైవేర్‌తో బ్యాంక్ అకౌంట్ వివరాలు చోరీ చేసే ప్రమాదం ఉందని పేర్కొంది.


