News September 10, 2024
కోలుకుంటున్న సూర్య.. బంగ్లాతో సిరీస్కు రెడీ!

బుచ్చిబాబు టోర్నమెంట్లో గాయపడిన T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 100 శాతం రికవరీ అయ్యారని తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా-C తరఫున బరిలో దిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్తో అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే 3 టీ20ల సిరీస్కు అతను అందుబాటులో ఉంటారన్నాయి.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


