News September 10, 2024

కోలుకుంటున్న సూర్య.. బంగ్లాతో సిరీస్‌కు రెడీ!

image

బుచ్చిబాబు టోర్నమెంట్‌లో గాయపడిన T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వేగంగా కోలుకుంటున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దాదాపు 100 శాతం రికవరీ అయ్యారని తెలిపాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా-C తరఫున బరిలో దిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. బంగ్లాదేశ్‌తో అక్టోబర్ 6 నుంచి మొదలయ్యే 3 టీ20ల సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటారన్నాయి.

Similar News

News October 11, 2024

జపాన్‌ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం

image

2024 ఏడాదికి గానూ నోబెల్ శాంతి బ‌హుమ‌తి జపనీస్ సంస్థ నిహాన్ హిడాంక్యోను వ‌రించింది. అణ్వాయుధాల రహిత ప్రపంచం కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్టు కమిటీ ప్రకటించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 111 మంది స‌భ్యులు, 31 సంస్థ‌ల‌ను నోబెల్ శాంతి బ‌హుమ‌తి వ‌రించింది. ఈ ఏడాది పుర‌స్కారానికి 286 నామినేష‌న్ల‌ను ప‌రిశీలించిన క‌మిటీ నిహాన్ హిడాంక్యోను పుర‌స్కారానికి ఎంపిక చేసింది.

News October 11, 2024

ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతి హాసన్ ఆగ్రహం

image

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానం ఆలస్యం కావడం పట్ల నటి శ్రుతి హాసన్ అసహనం వ్యక్తం చేశారు. ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘నేను సాధారణంగా ఫిర్యాదులు చేయను. ఇండిగో.. మీరు సేవల్లో ఎప్పటికప్పుడు దిగజారుతున్నారు. నాలుగు గంటలుగా ఎయిర్‌పోర్టులోనే మగ్గుతున్నాం. దీనిపై మీ నుంచి కనీస సమాచారం లేదు. మీ పాసింజర్ల కోసం మెరుగైన మార్గాల్ని అన్వేషించండి. ప్లీజ్’ అని కోరారు.

News October 11, 2024

గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

image

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల తేదీలను TGPSC ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో OMR విధానంలో పేపర్-1,2,3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పటికే శాంపిల్ OMR ఆన్సర్ షీటును వెబ్‌సైటులో అందుబాటులో ఉంచామంది.