News September 25, 2024

హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు

image

TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News September 25, 2024

విశాఖ ఉక్కుకు పునర్వైభవం: లోకేశ్

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విశాఖ ప్రాంత కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో లోకేశ్ సమావేశమై ప్లాంట్ అంశంపై చర్చించారు. విశాఖ ఉక్కుతో ప్రతి తెలుగు వారికి అనుబంధం ఉందని చెప్పారు. ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కుకు పునర్వైభవం తీసుకొస్తామని వివరించారు.

News September 25, 2024

దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ?

image

TG: దసరాలోగా నాలుగో విడత రుణమాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 4.25 లక్షల మందికి మాఫీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే 22 లక్షల మందికి రూ.17,934 కోట్లు మాఫీ చేసింది. రేషన్ కార్డులు లేని రైతులు, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉన్నవారికి, ఇతర సాంకేతిక సమస్యలు, కుటుంబ నిర్ధారణ కానివారికి మాఫీ చేస్తారు. ఇందుకు సంబంధించిన డేటా అప్‌లోడ్ ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియనుంది.

News September 25, 2024

IPL-2025పై బిగ్ అప్‌డేట్!

image

IPLలో ప్లేయర్ల రిటెన్షన్ (అట్టిపెట్టుకోవడం)పై అప్‌డేట్ వచ్చింది. మెగా వేలానికి ముందు ఒక ఫ్రాంచైజీ ఐదుగురు ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అందులో ముగ్గురు భారత, ఇద్దరు విదేశీ ప్లేయర్లు ఉండొచ్చనే రూల్ పెట్టినట్లు సమాచారం. RTM (రైటు టు మ్యాచ్) ఆప్షన్ ఉండదని వార్తలొస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.