News September 25, 2024
హైడ్రాలో 169 పోస్టుల భర్తీ.. ప్రభుత్వం ఉత్తర్వులు
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రాలో కొత్తగా 169 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. నలుగురు అదనపు కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను డిప్యుటేషన్‌పై కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News October 5, 2024
ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎలా పని చేస్తుందంటే?
TG: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనుంది. రేషన్ షాప్‌కు వెళ్లి ఈ కార్డులోని QR కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ స్కీములు, RTC బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చు.
News October 5, 2024
బొగ్గు కన్నా LNGతోనే ఎక్కువ నష్టం
పర్యావరణ అనుకూల ఇంధనంగా భావించే LNG(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) గురించి ఓ షాకింగ్ రిపోర్టును కార్నెల్ వర్సిటీ(US) శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వంట, విద్యుత్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వినియోగించే దీనివల్ల 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలైనట్లు తెలిపారు. కాగా మీథేన్‌తో తయారయ్యే సహజ వాయువులను LNGగా మార్చడానికి మైనస్ 105 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబర్చాల్సి ఉంటుంది.
News October 5, 2024
ఈసారి చలి తీవ్రత అధికం: IMD
దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తిరోగమనంలో నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉందని, దీనివల్ల ఈ నెలలో ‘లా నినా’ ఏర్పడే పరిస్థితులున్నాయని తెలిపింది. వాయవ్య, మధ్య భారతదేశంలో విపరీతమైన చలిగాలులు వీస్తాయంది. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3-5 డిగ్రీలు ఉండొచ్చు.