News August 31, 2024
తెలుగు రాష్ట్రాలకు RED ALERT
భారీ వర్షాల నేపథ్యంలో AP, TGలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. APలోని పల్నాడు, NTR, గుంటూరు, కృష్ణా, ఏలూరు, ప.గో, తూ.గో, కోనసీమ జిల్లాల్లో, అటు TGలో NLG, నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి, నారాయణపేటలో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఇరు రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భారీ వర్షాలున్నాయని చెప్పింది. మీ జిల్లా వివరాల వివరాలకు ఇక్కడ <
Similar News
News September 18, 2024
బీసీలకు 33శాతం రిజర్వేషన్‌కు క్యాబినెట్ ఆమోదం
AP: వెనుకబడిన వర్గాల వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదలను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి రాజకీయపరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తిస్తూ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
News September 18, 2024
BREAKING: 2050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
TG: 2050 నర్సింగ్ ఆఫీసర్స్(స్టాఫ్ నర్స్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 17న CBT విధానంలో పరీక్ష జరుగుతుంది. ఎంపికైన వారికి రూ.36,750-1,06,990 పేస్కేల్ విధానంలో జీతం చెల్లిస్తారు. GNM లేదా బీఎస్సీ(నర్సింగ్) అర్హత ఉన్న 18 నుంచి 46 ఏళ్లలోపు వారు అర్హులు. పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ <
News September 18, 2024
తిరుమల ప్రసాదం విషయంలో ప్రమాణం చేయడానికి సిద్ధం: వైవీ
AP: తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన <<14134836>>వ్యాఖ్యలు <<>>అత్యంత దుర్మార్గమని TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్దమా?’ అని సవాల్ విసిరారు.