News February 15, 2025
టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: లోకేశ్

AP: వైసీపీ హయాంలో జరిగిన అరాచకపాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన వారిపై రెడ్ బుక్ అమలవుతుందని స్పష్టం చేశారు. తప్పుచేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలోనే చెప్పానన్నారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
Similar News
News November 20, 2025
రైతులకు గుడ్‌న్యూస్.. సోయా కొనుగోలు పరిమితి పెంపు

సోయా కొనుగోలు పరిమితిని ప్రభుత్వం పెంచిందని KMR జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. గతంలో ఎకరానికి 7.62 క్వింటాళ్లుగా ఉన్న పరిమితిని 10 క్వింటాళ్లకు పెంచడం జరిగింది. రైతులు తమ సోయాను తేమశాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. రైతుల పేరుతో దళారులు ఎవరైనా కొనుగోలు కేంద్రాల్లో అమ్మకాలు జరిపితే, సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
News November 20, 2025
కుక్క కాటు వల్ల చనిపోతే రూ.5 లక్షల పరిహారం

కుక్క కాటు వల్ల ఎవరైనా చనిపోతే బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.5 వేలు ఇస్తామని, ఇందులో రూ.3,500 బాధితులకు, రూ.1,500 ట్రీట్మెంట్ కోసం అందజేస్తామని తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆయుష్మాన్ భారత్-ఆరోగ్య కర్ణాటక స్కీమ్ కింద పాము కాటు బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది.
News November 20, 2025
26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్‌కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.


