News February 15, 2025

టీడీపీ నేతలను వేధించినవారిపై రెడ్‌బుక్ అమలు: లోకేశ్

image

AP: వైసీపీ హయాంలో జరిగిన అరాచకపాలన ప్రజలందరికీ తెలుసని మంత్రి లోకేశ్ చెప్పారు. చట్టాలను ఉల్లంఘించి టీడీపీ నేతలను ఇబ్బందిపెట్టిన వారిపై రెడ్ బుక్ అమలవుతుందని స్పష్టం చేశారు. తప్పుచేసిన వైసీపీ నేతలు, అధికారులను చట్టపరంగా శిక్షిస్తామని యువగళంలోనే చెప్పానన్నారు. ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వల్లభనేని వంశీ జైలుకెళ్లారని, ఈ కేసులో వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

AB -PMJAY: గిగ్ వర్కర్స్‌కు గుడ్‌న్యూస్

image

గిగ్ వర్కర్స్, వారి కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ ప్రయోజనాలను అందించే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చిందని లేబర్ మినిస్ట్రీ సెక్రటరీ సుమిత తెలిపారు. ‘గిగ్ వర్కర్స్‌కు ఆరోగ్య బీమా అందించాలి. ఆయుష్మాన్ స్కీమ్ కింద వారికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది’ అని వెల్లడించారు. దీంతో ఉబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో వర్కర్స్‌కు రూ.5లక్షల ఆరోగ్య బీమా లభించనుంది.

News March 25, 2025

రానున్న 4 రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

News March 25, 2025

నేనెప్పుడు కేసీఆర్‌ను కించపరచలేదు: జూపల్లి

image

TG: తానెప్పుడూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌ను కించపరచలేదని, భవిష్యత్తులోనూ కించపరచబోనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉందని చెప్పారు. అయితే సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. మూడు లక్షల అదనపు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!