News July 13, 2024

గోదావరికి ఎర్రనీరు.. పులసకు రూ.24,000

image

AP: ఈ సీజన్లో గోదావరికి వరద ప్రారంభం కావడంతో పులస చేపల సందడి మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మం. రామరాజులంక వద్ద ఉన్న వశిష్ఠ గోదావరిలో కేజిన్నర బరువున్న పులస చేప చిక్కింది. దీన్ని ఓ వ్యక్తి రూ.24వేలకు కొనుగోలు చేశారు. ఏడాదిలో తక్కువ కాలం లభ్యం కావడం, రుచి అమోఘంగా ఉండటంతో పులస చేపలకు డిమాండ్ ఎక్కువ.

Similar News

News November 19, 2025

సిద్దిపేట: నిరంతరం కృషిచేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్

image

శాస్త్రీయ విజ్ఞానంపై నిరంతరం కృషిచేసి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ప్రేరణ, బాల వైజ్ఞానిక ప్రదర్శినను నిర్వహించగా ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎస్సీ,ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య, గ్రంథాలయ ఛైర్మన్ లింగమూర్తి హజరయ్యారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో 183 ఇన్స్పైర్ ప్రాజెక్టులు ప్రదర్శించారు.

News November 19, 2025

వన్డేల్లో తొలి ప్లేయర్‌గా రికార్డు

image

వెస్టిండీస్ ప్లేయర్ షై హోప్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఫుల్‌ మెంబర్ టీమ్స్ అన్నింటిపై సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. అటు వన్డేల్లో హోప్ 19 సెంచరీలు నమోదు చేశారు. అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ ఫుల్‌ మెంబర్స్ టీమ్స్. కాగా ఇవాళ్టి రెండో వన్డేలో వెస్టిండీస్‌పై NZ గెలిచింది.

News November 19, 2025

సూసైడ్ బాంబర్: క్లాసులకు డుమ్మా.. ఆర్నెళ్లు అజ్ఞాతం!

image

ఢిల్లీ పేలుళ్ల బాంబర్ ఉమర్‌కు అల్ ఫలాహ్ వర్సిటీ స్వేచ్ఛ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. అతడు క్లాస్‌లకు సరిగా వచ్చేవాడు కాదని, వచ్చినా 15 ని.లు మాత్రమే ఉండేవాడని సహచర వైద్యులు విచారణలో తెలిపారు. 2023లో ఆర్నెళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లాడన్నారు. ఉమర్‌ను తొలగించాల్సి ఉన్నాతిరిగి రాగానే వర్సిటీ విధుల్లో చేర్చుకుందని చెప్పారు. పోలీసుల వరుస విచారణలతో డాక్టర్లు, స్టూడెంట్లు వర్సిటీ నుంచి వెళ్లిపోతున్నారు.