News March 16, 2024
రెండోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప

చిత్తూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రెండోసారి రెడ్డప్పను అధిష్ఠానం ఖరారు చేసింది. 2019 ఎన్నికలలో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈయన పుంగనూరు నియోజకవర్గం సోమల మండలానికి చెందినవారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో లీడ్ క్యాప్ ఛైర్మన్గా పనిచేశారు. రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 28, 2025
చిత్తూరు జిల్లాకు మరో 25,592 ఇళ్లు.!

PMAY పథకం కింద <<18682670>>చిత్తూరు<<>> జిల్లాకు 25,592 పక్కా గృహాలు అవసరమని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇందులో అత్యధికంగా పలమనేరుకు 9,651, కుప్పంకు 6,986, పుంగనూరుకు 2726, GD నెల్లూరుకు 2319, పూతలపట్టుకు 1905, నగరికి 1332, చిత్తూరుకు 671 పక్కా గృహాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఈ అవసరాలకు అనుగుణంగా దశలవారీగా పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు.
News December 27, 2025
పలమనేరు, పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్లో మార్పులు!

జిల్లాల పునర్విభజనపై CM చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా పరిధిలో చేపట్టనున్న మార్పులను కొనసాగించాలని నిర్ణయించారు. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని బంగారుపాలెంను చిత్తూరు డివిజన్కు, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయడం, సదుం, సోమల మండలాలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్లో విలీనం చేయాలని తేల్చారు. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది.
News December 27, 2025
కుప్పం: మహిళతో వివాహేతర సంబంధం.. యువకుడి సూసైడ్

కుప్పం (M) నూలుకుంట గ్రామంలో నాగరాజు కుమారుడు కాళీ (35) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇటీవల కాళీ గొడవపడి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాళీ కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


