News March 16, 2024

రెండోసారి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప

image

చిత్తూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా రెండోసారి రెడ్డప్పను అధిష్ఠానం ఖరారు చేసింది. 2019 ఎన్నికలలో ఆయన ఎంపీగా గెలుపొందారు. ఈయన పుంగనూరు నియోజకవర్గం సోమల మండలానికి చెందినవారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. గతంలో లీడ్ క్యాప్ ఛైర్మన్‌గా పనిచేశారు. రెండోసారి ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 10, 2024

ఈనెల 16 నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం

image

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16న ప్రారంభం కానుంది. ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు.

News December 10, 2024

21 నుంచి SVU పరీక్షల ప్రారంభం

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 10, 2024

తిరుపతి: యువతి మృతి.. అసలేం జరిగింది?

image

చంద్రగిరి(M) ముంగిలిపట్టు వద్ద నిన్న <<14835672>>చనిపోయిన <<>>యువతి పాకాల(M) వడ్డేపల్లికి చెందిన శ్రావణి(23)గా గుర్తించారు. తిరుపతిలో పనిచేసే ఆమెకు పూతలపట్టు(M) కమ్మవాండ్లపల్లె కార్తీక్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ బైకుపై తిరుపతి నుంచి ముంగిలిపట్టుకు వచ్చారు. సాయంత్రం అమ్మాయి ఏడుస్తుండగా స్థానికులు గమనించారు. ఆ తర్వాత ఆమెను కార్తీక్ ఏమైనా చేశాడా? రోడ్డు దాటుతుంటే వాహనం ఢీకొని చనిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది.