News July 31, 2024

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

image

AP: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 2,91,003 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 212 TMCల నీటి నిల్వ ఉండగా నీటి మట్టం 884.50 అడుగులుగా ఉంది. 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,22,768 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ 60,232 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.

Similar News

News April 3, 2026

లక్ష్మీదేవికి ఇష్టం లేని, దారిద్ర్యం తెచ్చే పనులు

image

ఉదయాన్నే ఇల్లు, వాకిలి శుభ్రం చేయకపోవడం, సాయంత్రం సంధ్యా దీపం పెట్టకపోవడం, భోజనం చేసిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోవడం వంటి పనులు లక్ష్మీదేవికి ఇష్టం ఉండవని పండితులు చెబుతున్నారు. లేవగానే అరవడం, సరిగా వండని ఆహారాన్ని తినడం, తడిబట్టలతో భోజనం చేయడం, మంచం, కుర్చీలపై కూర్చొని భుజించడం కూడా అశుభం అంటున్నారు. ఇలాంటి పనులు ఇంటికి దారిద్ర్యాన్ని తెస్తాయని, అందుకే మానుకోవాలని సూచిస్తున్నారు.

News April 3, 2026

లక్ష్మీదేవి కటాక్షం కోసం నేడు ఏం చేయాలంటే..

image

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఉప్పు కొనాలని పండితులు చెబుతున్నారు. అలాగే పడుకునేటప్పుడు ఈశాన్యంలో దీపం వెలిగించడం, ఆవులకు నెయ్యి, బెల్లం కలిపిన ఆహారం లేదా గడ్డి తినిపించడం మంచిదని అంటున్నారు. ‘లక్ష్మీదేవికి పూలను సమర్పించాలి. వైవాహిక జీవితంలో ఆనందం కోసం గులాబీలు ఇవ్వాలి. సాయంత్రం పంచముఖి దీపం వెలిగించి, కర్పూరం హారతి బూడిదను పర్సులో ఉంచుకుంటే చేతిలో డబ్బు నిలుస్తుంది’ అని చెబుతున్నారు.

News April 3, 2026

ట్రంప్ స్పీచ్ ఎఫెక్ట్.. నాలుగేళ్ల గరిష్ఠానికి చేరిన US ఆయిల్ ధర!

image

యుద్ధం ముగింపుపై US అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ దేశ ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. WTI క్రూడ్ బ్యారెల్ ధర అంతకుముందుతో పోలిస్తే ఏకంగా 11.42% పెరిగి $111.15కు చేరింది. 2022 తర్వాత అమెరికన్ క్రూడ్ ఆయిల్ ధర ఈస్థాయిలో పలకడం ఇదే తొలిసారి. మరోవైపు యూకేకు చెందిన బ్రెంట్ క్రూడ్ 7.87% పెరిగి ఒక బ్యారెల్ ధర $109కు చేరింది. ఇక గల్ఫ్‌లోని ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ ధర 114.8 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.