News December 26, 2024
రూ.99 మద్యంలో తగ్గిన నాణ్యత?
AP: కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన రూ.99కే క్వార్టర్ మద్యంలో కాస్త నాణ్యత లోపించిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆల్కహాల్ శాతం అలాగే ఉన్నా రుచిలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఒకట్రెండు ఫేమస్ బ్రాండ్లు నాణ్యతలో రాజీపడుతున్నట్లు సమాచారం. అయితే ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండటంతో ఎక్సైజ్ శాఖ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది.
Similar News
News January 13, 2025
ఉక్రెయిన్‌తో యుద్ధంలో కేరళ వాసి మృతి
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతున్న కేరళలోని త్రిసూర్ వాసి బినిల్(32) మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు. కొన్ని రోజుల క్రితం వీరు డ్రోన్ దాడిలో గాయపడినట్టు ఫ్యామిలీకి సమాచారం వచ్చింది. బినిల్ భార్య మాస్కోలోని భారత ఎంబసీని సంప్రదించగా ఆయన మృతిని వారు మౌఖికంగా అంగీకరించారు. తిరిగి ఇంటికి చేరుకొనేందుకు బాధితులిద్దరూ గతంలో విఫలప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది.
News January 13, 2025
బ్రాహ్మణులు నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష.. ఎక్కడంటే?
యువ బ్రాహ్మణ దంపతులకు MP ప్రభుత్వ ఆధ్వర్యంలోని పరశురామ్ కళ్యాణ్ బోర్డు ఆఫర్ ప్రకటించింది. నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ఆ బోర్డు అధ్యక్షుడు పండిత్ విష్ణు రాజోరియా వెల్లడించారు. ‘మనం కుటుంబాలపై దృష్టి పెట్టట్లేదు. యువత ఒక బిడ్డతోనే ఆగిపోతోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. భవిష్యత్ తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది. అందుకే కనీసం నలుగురు పిల్లల్ని కనాలి’ అని పేర్కొన్నారు.
News January 13, 2025
ఇన్ఫోసిస్: వచ్చే నెలలో జీతాల పెంపు?
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వారికి ఫిబ్రవరిలో జీతాలు పెంచేందుకు కంపెనీ సిద్ధమైనట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. కన్సల్టెంట్లు, సీనియర్ ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, సిస్టమ్ ఇంజినీర్లు తదితరులకు జనవరి 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. సంస్థలోని ఉన్నతోద్యోగులకు హైక్ లెటర్స్ మార్చిలో అందజేసే అవకాశం ఉందని పేర్కొంది. కంపెనీ చివరిసారిగా 2023 NOVలో <<15078700>>హైక్ ఇచ్చిన<<>> విషయం తెలిసిందే.