News June 15, 2024
తగ్గిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అవస్థలు!

TG: రాష్ట్రంలోని 1,497 గ్రామాలకు RTC బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2014-15 నాటికి RTCలో 10,479 బస్సులు ఉండగా, 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడం, అనూహ్యంగా ప్రయాణికులు పెరగడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కొత్త బస్సుల్ని తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు సూచిస్తున్నారు.
Similar News
News November 20, 2025
నేడు సీబీఐ కోర్టుకు జగన్

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.
News November 20, 2025
నేడు కార్తీక అమావాస్య! ఇలా చేస్తే..

‘కార్తీక అమావాస్య రోజున పితృ దేవతలకు పూజ చేయాలి. దీపదానం, అన్నదానంతో ఎంతో పుణ్యం వస్తుంది. సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శివుడికి రుద్రాభిషేకం, విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించడం శుభకరం. బెల్లం, నువ్వులు నైవేద్యంగా పెట్టాలి. చీమలకు పంచదార ఇస్తే శని దోషాలు పోతాయి. ఉపవాసం ఉంటే కార్తీక మాసం మొత్తం ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది’ అని పండితులు సూచిస్తున్నారు.
News November 20, 2025
ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు: డీకే శివకుమార్

KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనని కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటికే ఐదున్నరేళ్లు అయిందని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ CM అయినప్పుడే PCC చీఫ్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నా. కానీ కొనసాగమని రాహుల్, ఖర్గే చెప్పారు. నా డ్యూటీ నేను చేశా’ అని తెలిపారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


