News June 15, 2024

తగ్గిన ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికుల అవస్థలు!

image

TG: రాష్ట్రంలోని 1,497 గ్రామాలకు RTC బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. 2014-15 నాటికి RTCలో 10,479 బస్సులు ఉండగా, 2024 నాటికి 8,574 మాత్రమే ఉన్నాయి. బస్సులు తక్కువగా ఉండడం, అనూహ్యంగా ప్రయాణికులు పెరగడంతో సమస్యలు ఏర్పడుతున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో కొత్త బస్సుల్ని తీసుకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు సూచిస్తున్నారు.

Similar News

News September 16, 2024

ఢిల్లీ సీఎం రేసులో ‘ఆ ఐదుగురు’

image

ఢిల్లీ CM రేసులో ఐదుగురి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. PWD, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆతిశీ మార్లేనా అందరికన్నా ముందున్నారు. కేజ్రీవాల్ జైలుకెళ్లినప్పుడు ప్రభుత్వాన్ని ఆమే నడిపించారు. 3సార్లు MLA, మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు అవకాశం దక్కొచ్చు. రాజ్యసభ సభ్యుడు, పార్టీ వైఖరిని ప్రజలు, మీడియాలో బలంగా చాటే రాఘవ్ చద్దా పేరును కొట్టిపారేయలేరు. సీనియర్లు కైలాష్ గహ్లోత్, సంజయ్ సింగ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

News September 16, 2024

ఇండియాలో ఎక్కువ మందికి ఉన్న చివరి పేరు ఇదే!

image

ఒకరిని పోలిన వ్యక్తులు భూమిపై ఏడుగురు ఉంటారని చెబుతుంటారు. ఒకే పేరును కలిగిన వాళ్లు వేలల్లో ఉంటారు. అయితే, ఇండియాలో ఎక్కువ మంది తమ చివరి పేరును కుమార్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. అర్జెంటీనాలో గొంజాలెజ్, ఆస్ట్రేలియాలో స్మిత్, బంగ్లాదేశ్‌లో అక్తర్, బ్రెజిల్‌లో డా సిల్వా, కెనడాలో స్మిత్, చైనాలో వాంగ్, ఈజిప్టులో మొహమ్మద్, ఫ్రాన్స్‌లో మార్టిన్ అనే పేర్లు కామన్‌గా పెట్టుకుంటున్నారని ఓ సర్వే పేర్కొంది.

News September 16, 2024

నేడు కొరియాతో టీమ్ ఇండియా సెమీస్ పోరు

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ ఇండియా ఈరోజు సెమీస్ మ్యాచ్ ఆడనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొరియాతో ఢీకొట్టనుంది. లీగ్ దశలో ఐదింటికి ఐదు మ్యాచులనూ హర్మన్‌ప్రీత్ సింగ్ సేన సునాయాసంగా గెలుచుకుంటూ వచ్చింది. ఈరోజు గెలిస్తే ఫైనల్‌కు చేరుకుంటుంది. అటు పాక్ కూడా సెమీస్ చేరి ఈరోజు చైనాతో తలపడుతోంది. ఈ నెల 17న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.