News September 17, 2024

తగ్గిన హోల్‌సేల్ ధరలు!

image

ఆగస్టులో WPI ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. జులైలోని 2.04 నుంచి 4 నెలల కనిష్ఠమైన 1.31 శాతానికి చేరింది. ఆహార ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నా తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడమే దీనికి కారణం. జులైలో 3.45% ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.11కి తగ్గింది. పప్పులు, బియ్యం, ఉల్లి ధరలు కాస్త తగ్గితే ఆలు, పళ్లు, నూనెలు పెరిగాయి. ప్యాకేజీ ఫుడ్స్, బెవరేజెస్, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తుల ధరలు తగ్గాయని కామర్స్ మినిస్ట్రీ అంటోంది.

Similar News

News October 22, 2025

కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

image

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.

News October 22, 2025

ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

image

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్‌లో 29, సెకండియర్‌లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్‌లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.

News October 22, 2025

పోషకాల నిలయం.. BPT-2858 ఎర్ర వరి రకం

image

అత్యంత పోషక విలువలు గల BPT-2858 ఎర్ర బియ్యం రకాన్ని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది. ఇది త్వరలో మార్కెట్‌లోకి రానుంది. దీని పంట కాలం 135 రోజులు. దిగుబడి హెక్టారుకు ఆరు టన్నులు. మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్‌ రాకుండా రోగ నిరోధక శక్తి వృద్ధి చేయడంలో ఈ రకం కీలకపాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
* రోజూ అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.