News September 17, 2024

తగ్గిన హోల్‌సేల్ ధరలు!

image

ఆగస్టులో WPI ఇన్‌ఫ్లేషన్ తగ్గింది. జులైలోని 2.04 నుంచి 4 నెలల కనిష్ఠమైన 1.31 శాతానికి చేరింది. ఆహార ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నా తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గడమే దీనికి కారణం. జులైలో 3.45% ఉన్న ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ 3.11కి తగ్గింది. పప్పులు, బియ్యం, ఉల్లి ధరలు కాస్త తగ్గితే ఆలు, పళ్లు, నూనెలు పెరిగాయి. ప్యాకేజీ ఫుడ్స్, బెవరేజెస్, టెక్స్‌టైల్స్, ఫార్మా ఉత్పత్తుల ధరలు తగ్గాయని కామర్స్ మినిస్ట్రీ అంటోంది.

Similar News

News October 4, 2024

దసరాకు ప్రత్యేక రైళ్లు

image

దసరా సెలవుల నేపథ్యంలో పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది.

News October 4, 2024

అత్యంత ధనిక యాక్టర్ ఈయనే!

image

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన మేల్ యాక్టర్స్ జాబితాలో నటుడు, చిత్రనిర్మాత టైలర్ పెర్రీ ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన సంపద నికర విలువ దాదాపు $1.4 బిలియన్ (₹11,750 కోట్లు). రెండో స్థానంలో హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ ($1 బిలియన్) ఉన్నారు. వీరి తర్వాత డ్వేన్ జాన్సన్ ($890 మిలియన్లు), షారుఖ్ ఖాన్ ($870 మిలియన్లు), టామ్ క్రూయిజ్ ($800 మిలియన్లు) ఉన్నారు.

News October 4, 2024

ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సల్స్ హతం

image

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ-నారాయణ్‌పూర్ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆటోమేటిక్ గన్లు, పేలుడు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.