News November 21, 2024
విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా సంస్కరణలు: మంత్రి లోకేశ్
AP: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్రయోజకులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలుచేయాలని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. ‘GOVT స్కూళ్లలో అడ్మిషన్లను పెంచడం, టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు యాప్ను తీసుకొస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను APతో పంచుకోవాలని WB ప్రతినిధులను కోరా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 22, 2024
పాక్లోకి త్వరలో చైనా సైన్యం.. ఎందుకంటే?
పాక్లో ఉంటున్న తమ దేశస్థులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత కోసం చైనా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే మూడు ప్రైవేట్ కంపెనీలను నియమించుకుంది. అలాగే తమ సైన్యాన్ని కూడా పాక్లో మోహరించాలని యోచిస్తోంది. CPEC ప్రాజెక్ట్స్ కోసం దాదాపు 30వేల మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు అక్కడ ఉంటున్నారు. వారి భద్రతపై చైనా ఆందోళన చెందడంతో పాక్ సర్కార్ కూడా రక్షణ రంగానికి నిధులను పెంచింది.
News November 22, 2024
BGT: ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి టెస్టు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్తోపాటు హాట్ స్టార్లో కూడా వీక్షించవచ్చు. స్థానిక భాషల్లోనూ మ్యాచ్ లైవ్ అవుతుంది. కాకపోతే ఈ ఛానళ్లను సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ స్పోర్ట్స్లో ఫ్రీగా చూడవచ్చు. ఇందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.
News November 22, 2024
JEE MAIN: నేడే లాస్ట్ డేట్
జేఈఈ మెయిన్-2025 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ఇవాళ రా.9 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, రా.11.50 వరకు ఫీజు చెల్లించవచ్చని NTA తెలిపింది. ఈనెల 26, 27 తేదీల్లో దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించనుంది. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 31వ తేదీ మధ్య ఈ పరీక్ష జరగనుంది. ఏప్రిల్లో సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది.
వెబ్సైట్: jeemain.nta.nic.in