News November 21, 2024

విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా సంస్కరణలు: మంత్రి లోకేశ్

image

AP: వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి లోకేశ్ స‌మావేశ‌మ‌య్యారు. విద్యార్థులపై ప్రయోగాలు చేయకుండా ప్ర‌యోజ‌కులుగా తీర్చిదిద్దే సంస్కరణలు అమలుచేయాలని వారికి సూచించినట్లు ఆయన తెలిపారు. ‘GOVT స్కూళ్లలో అడ్మిషన్లను పెంచడం, టీచర్ల బదిలీలు పారదర్శకంగా చేసేందుకు యాప్‌ను తీసుకొస్తున్నాం. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాలను APతో పంచుకోవాల‌ని WB ప్రతినిధులను కోరా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 2, 2024

శిండేకు అనారోగ్యం.. ఢిల్లీకి అజిత్ పవార్

image

మ‌హారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా మహాయుతిలో పదవుల పంపకం కొలిక్కిరావడం లేదు. కీలక శాఖల కోసం శివసేన, NCP పట్టుబడుతున్నాయి. శాఖల కేటాయింపు తేలకపోవడంతోనే CM అభ్యర్థి ప్రకటనను బీజేపీ వాయిదా వేస్తోంది. దీనిపై సోమవారం జ‌ర‌గాల్సిన మ‌హాయుతి నేత‌ల స‌మావేశం శిండే అనారోగ్యం వ‌ల్ల వాయిదా ప‌డినట్టు తెలిసింది. మరోవైపు కోరిన శాఖల్ని దక్కించుకొనేందుకు అజిత్ పవార్ మళ్లీ ఢిల్లీకి పయనమయ్యారు.

News December 2, 2024

మోస్ట్ డిజాస్టర్ మూవీగా ‘కంగువ’!

image

తమిళ స్టార్ నటుడు సూర్య నటించిన పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘కంగువ’ థియేట్రికల్ రన్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. నెగటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ.130 కోట్ల నష్టంతో ఆల్‌టైమ్ డిజాస్టర్‌గా నిలిచినట్లు వెల్లడించాయి. ఇప్పటివరకు ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. ఈ మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. కాగా మరికొన్ని రోజుల్లో ‘కంగువ’ OTTలోకి రానుంది.

News December 2, 2024

ఉద్యోగుల అంత్యక్రియల ఛార్జీలు పెంపు

image

TG: ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఇచ్చే అంత్యక్రియల ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఖర్చును రూ.20 వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.