News August 11, 2024

20 నుంచి కొత్త ఓటర్ల నమోదు

image

AP: కొత్త ఓటర్ల నమోదు, పాత ఓటర్ల జాబితాలో సవరణలకు <>EC<<>> షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 20 నుంచి BLOలు ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కూడా ఇప్పుడే ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 18 నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 29న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. నవంబర్ 28 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారు.

Similar News

News September 10, 2024

సైన్యం వద్దంటున్నా బైడెన్ వినలేదు: నివేదిక

image

అఫ్గానిస్థాన్‌ నుంచి బలగాల ఉపసంహరణ వద్దని అమెరికా మిలిటరీ, అఫ్గాన్ ప్రభుత్వం, నాటో సూచిస్తున్నా దేశాధ్యక్షుడు బైడెన్ లెక్కచేయలేదని US విదేశీ వ్యవహారాల కమిటీ నివేదిక వెల్లడించింది. ‘నిపుణులు, సలహాదారుల సూచనలన్నింటినీ బైడెన్ పెడచెవిన పెట్టారు. దేశ ప్రయోజనాల కంటే తన వ్యక్తిగత ప్రతిష్ఠే ముఖ్యమనుకున్నారు. తన నిర్ణయానికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు అనేక అబద్ధాల్ని చెప్పుకొచ్చారు’ అని నివేదిక తెలిపింది.

News September 10, 2024

విరాట్ బెస్ట్ బ్యాటర్.. స్టెయిన్ బెస్ట్ బౌలర్: KL రాహుల్

image

తన ద‌ృష్టిలో విరాట్ కోహ్లీ బెస్ట్ బ్యాటర్ అని క్రికెటర్ కేఎల్ రాహుల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బౌలర్లలో డేల్ స్టెయిన్‌ను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. విరాట్, రోహిత్, సూర్య, బాబర్ ఆజం, ట్రావిస్ హెడ్ ప్రస్తుతం ఉత్తమ బ్యాటర్లని ఆయన అన్నారు. బౌలర్లలో స్టెయిన్, ఆండర్సన్, బుమ్రా, రషీద్, నసీమ్ షాలను అత్యుత్తమంగా భావిస్తానని పేర్కొన్నారు.

News September 10, 2024

వరద బాధితులకు ‘మేఘా’ సంస్థ భారీ విరాళం

image

AP: వరద బాధితులకు మేఘా సంస్థ రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం చంద్రబాబుకు ఆ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుబ్బయ్య కలిసి అందించారు. అలాగే లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత కిరణ్ రూ.కోటి సాయం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆయన సీఎంకు ఇచ్చారు. జీఎంఆర్ సంస్థ రూ.2.5 కోట్ల విరాళం ఇచ్చింది.