News September 28, 2024

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్

image

AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ రిజిస్ట్రేషన్లపై తదుపరి చర్యలు చేపడుతుందని వివరించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ సిసోడియా పేరుతో జీవో జారీ అయ్యింది.

Similar News

News July 10, 2025

GPO రెండో విడత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

TG: గ్రామ పాలన అధికారుల(GPO) భర్తీకి రెండో విడత నోటిఫికేషన్ విడుదలైంది. 10,954 పోస్టుల భర్తీకి మార్చి 29న మొదటి నోటిఫికేషన్ రాగా 3,550 మంది ఎంపికయ్యారు. మిగతా ఖాళీల్లోనూ గతంలో వీఆర్ఏ, వీఆర్వోలుగా చేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నెల 16లోపు కలెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 27న GPO పరీక్ష నిర్వహించనున్నారు.

News July 10, 2025

BREAKING: ఢిల్లీలో భూకంపం

image

దేశ రాజధాని ఢిల్లీతోపాటు హరియాణా, యూపీలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.4గా నమోదైంది. 15 సెకన్లపాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. హరియాణాలోని రోహ్‌తక్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

News July 10, 2025

ఛంగూర్ బాబా: సైకిల్ నుంచి రూ.100 కోట్ల ఆస్తి!

image

UPలో అనధికార మత మార్పిడులకు పాల్పడుతున్న ఛంగూర్ బాబా కేసు వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడికి మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నట్లు, 40 బ్యాంకు ఖాతాలు, రూ.106 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాబా గతంలో సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయిత్తులు అమ్ముకునేవాడు. అతడు బలరాంపూర్(D) రెహ్రా మాఫీలో ఓ భారీ భవనం నిర్మించుకోగా యోగి సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేసింది.