News January 30, 2025

అలాంటి ఇళ్ల క్రమబద్ధీకరణ.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

image

AP: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు.

Similar News

News November 23, 2025

HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.

News November 23, 2025

APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

image

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://jipmer.edu.in/

News November 23, 2025

ఓవైపు CBN, రేవంత్.. మరోవైపు జగన్, KTR

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెండు కీలక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో AP CM చంద్రబాబు, TG CM రేవంత్ ఒకే వేదికను పంచుకున్నారు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌కు AP మాజీ CM వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి KTR కలిసి హాజరయ్యారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీశాయి.