News May 25, 2024
విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ విడుదలైంది. జూన్ 12న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి. 2025 ఫిబ్రవరి 28లోపు టెన్త్ ప్రిఫైనల్, మార్చిలో ఫైనల్ పరీక్షలు ఉంటాయి. అక్టోబర్ 2 నుంచి 14 వరకు దసరా, డిసెంబర్ 23 నుంచి 27 వరకు క్రిస్మస్, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఉ.9.30 నుంచి సా.4.45 వరకు ఉన్నత పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తారు.
Similar News
News January 11, 2026
గేదె పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

ఆవు పాలకంటే గేదె పాలలో ఎక్కువ కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పాలు చాలా చిక్కగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గేదె పాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి ఎముకలను బలోపేతం చేస్తాయి. పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ వల్ల ఆవు పాల కంటే ఇవి ఎక్కువ సమయం నిల్వ ఉంటాయి. మంచి శరీర సౌష్టవం, బరువు పెరగాలనుకువేవారికి గేదె పాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.
News January 11, 2026
సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలి: హైకోర్టు

AP: సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలను, పేకాటను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపింది. జంతు హింస నిరోధక చట్టం-1960, జూద నిరోధక చట్టం-1974 అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. కోడి పందేలు, బెట్టింగ్లపై కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అన్ని మండలాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలంది.
News January 11, 2026
215 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ (ITI)లో 215 పోస్టులకు అప్లైకి దరఖాస్తు గడువును పొడిగించారు. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు JAN 16 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


