News May 19, 2024
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు నిధుల విడుదల

TG: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ప్రభుత్వం రూ.725 కోట్లను మంజూరు చేసింది. 2024-25 బడ్జెట్లో కేటాయించిన ఆయా నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాల కింద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. తులం బంగారం అందించడంపై ఇప్పటికే GOVTకి అధికారులు ప్రతిపాదనలు పంపించారు. దీని అమలుపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News November 21, 2025
వరంగల్: గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి

వరంగల్ జిల్లాలోని గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్, బీసీ వెల్ఫేర్ అధికారులను తెలంగాణ గౌడ సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏకాంతం గౌడ్, నేతలు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా గీత కార్మికులకు రావాల్సిన ఎక్స్గ్రేషియో చెల్లించాలని, తాటి, ఈత చెట్లు ఎక్కే ప్రతి గీత కార్మికుడికి సభ్యత్వాలు వెంటనే జారీ చేయాలని కోరారు.
News November 21, 2025
రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.
News November 21, 2025
సీఎస్ పదవీకాలం పొడిగింపు

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా 3 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు విజయానంద్ సీఎస్గా కొనసాగనున్నారు. అనంతరం సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు. అదే ఏడాది మేతో ఆయన పదవీకాలం కూడా ముగియనుంది.


