News May 24, 2024

పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

image

TG: వచ్చే నెల 20 నుంచి 2 విడతల్లో పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 22న తొలి విడత వెబ్ ఆప్షన్లు, 30న తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. ఇక జూన్ 30: మొదటి విడత సీట్ల కేటాయింపు, జులై 7: 2వ విడత కౌన్సెలింగ్, జులై 9: రెండో విడత వెబ్ ఆప్షన్లు, జులై 13: రెండో విడత సీట్ల కేటాయింపు, కన్వీనర్‌ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్, జులై 21: స్లైడింగ్‌కు అవకాశం, జులై 23న స్పాట్ అడ్మిషన్స్‌కు మార్గదర్శకాలు.

Similar News

News February 11, 2025

ఐఈడీ పేలుడు.. ఇద్దరు జవాన్లు మృతి

image

జమ్మూకశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మరణించగా మరికొందరు గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లోని ఫెన్సింగ్ వద్ద భద్రతా సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది.

News February 11, 2025

ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ వికటించి చిన్నారి మృతి

image

AP: అల్లూరి(D) మారేడుమిల్లి(M) తాడేపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. <<15414061>>ఆల్బెండజోల్ ట్యాబ్లెట్<<>>(నులిపురుగుల నివారణ మాత్ర) వికటించి నాలుగేళ్ల చిన్నారి రస్మిత కన్నుమూసింది. అన్నం తిన్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకున్న బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.

News February 11, 2025

సూపర్ హిట్ వెబ్‌సిరీస్ సీక్వెల్ రెడీ

image

ఐశ్వర్యా రాజేశ్, కథిర్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సుడల్: ది వర్టిక్స్’ సీక్వెల్ విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 2022లో విడుదలై పార్ట్-1 సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. పుష్కర్-గాయత్రి తెరకెక్కించిన ఈ సిరీస్‌ IMDb రేటింగ్ 8.1 సాధించడంతో పాటు 30 భాషల్లో స్ట్రీమింగ్ అయ్యింది.

error: Content is protected !!