News June 7, 2024
టీచర్ల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలో టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మల్టీ జోన్-1లో ఈనెల 22 వరకు, మల్టీ జోన్-2లో ఈనెల 30 వరకు ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు చేపట్టనుంది. పదవీ విరమణకు 3 ఏళ్లలోపు ఉన్నవారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. కోర్టు కేసులతో గతంలో ఆగిపోయిన దగ్గరి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. TETతో సంబంధం లేకుండానే పదోన్నతులు కల్పించనుంది.
Similar News
News January 30, 2026
జగన్‌ను కలిసిన చెవిరెడ్డి

AP: అక్రమ మద్యం కేసులో అరెస్టై నిన్న బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి YCP అధినేత జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని నివాసంలో కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలతో కలిసి వెళ్లి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తనతో పాటు కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని వివరించినట్లు YCP ట్వీట్ చేసింది. కాగా ఆందోళన చెందొద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ భరోసా ఇచ్చినట్లు పేర్కొంది.
News January 30, 2026
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ‘rebels’ బెడద

TG: మున్పి‘పోల్స్’లో పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRలకు వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్‌నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెంలలోని రెబల్స్‌పై పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో వారు మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్లు ముగిశాక వారిని ఉపసంహరింప చేసేలా చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు FEB3.
News January 30, 2026
IIT హైదరాబాద్‌లో ఉద్యోగాలు

<


