News January 23, 2025
12 ఏళ్ల తర్వాత రిలీజై.. రూ.100 కోట్లే లక్ష్యంగా!

తమిళ నటుడు విశాల్ హీరోగా సుందర్ తెరకెక్కించిన ‘మద గజ రాజా’ చిత్రం 12 ఏళ్ల తర్వాత విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలై ఇప్పటికే రూ.50 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ & ఓవర్సీస్‌లో విడుదలై రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News February 26, 2026
AI వల్ల ఆదాయం తగ్గినా ఓకే: TCS CEO

AI వల్ల కంపెనీ ఆదాయం తగ్గినా పర్లేదని TCS CEO కృతివాసన్ స్పష్టం చేశారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం తమకు లేదని, పైగా తమ 6 లక్షల మంది ఉద్యోగులు ఇందులో నైపుణ్యం సాధించాలని ఆదేశించారు. సీనియర్ల కంటే జూనియర్లే దీన్ని వేగంగా ఒంటబట్టించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. AIని కేవలం వాడుకోవడం కాకుండా కొత్త సొల్యూషన్స్ బిల్డ్ చేయాలని ఉద్యోగులకు సూచించారు.
News February 26, 2026
IND vs ZMB: టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనా?

T20 WC S-8లో నేడు భారత్, జింబాబ్వే చెన్నై వేదికగా తలపడనున్నాయి. తొలి మ్యాచుల్లో ఓడిన ఇరుజట్లకూ ఇది చావోరేవో తేల్చుకోవాల్సిన టైమ్. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని ‘డ్యూ ఫ్యాక్టర్’ శాసించేలా ఉంది. రాత్రి వేళ మంచు కురిస్తే బౌలర్లకు గ్రిప్ కష్టమై బ్యాటర్లు భారీ స్కోర్లు చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో టాస్ గెలిచిన టీమ్ చేజింగ్ వైపే మొగ్గు చూపొచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా సెమీస్ ఆశలు నిలవాలంటే భారత్ గెలవాల్సిందే.
News February 26, 2026
పెద్దన్నను కాదని భారత్‌కు ఇజ్రాయెల్ సాయం

దౌత్య సంబంధాలు లేని 1971లోనే అమెరికాను ఎదిరించి మరీ భారత్‌కు ఇజ్రాయెల్ రహస్యంగా ఆయుధాలు, శిక్షణ అందించింది. 1980లలో పాక్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకూ ఆఫర్ ఇచ్చింది. ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’కూ ఇజ్రాయెల్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితిలో వాషింగ్టన్ కంటే ఢిల్లీనే ఎక్కువగా నమ్ముతామని నెతన్యాహు గతంలో ప్రకటించారు. రక్షణ, వ్యవసాయం, AI రంగాల్లో ఇరు దేశాల సహకారం ఇప్పుడు మరింత బలోపేతమైంది.


