News January 23, 2025
12 ఏళ్ల తర్వాత రిలీజై.. రూ.100 కోట్లే లక్ష్యంగా!

తమిళ నటుడు విశాల్ హీరోగా సుందర్ తెరకెక్కించిన ‘మద గజ రాజా’ చిత్రం 12 ఏళ్ల తర్వాత విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా విడుదలై ఇప్పటికే రూ.50 కోట్లు వసూలు చేసింది. తెలుగులోనూ విడుదలకు సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ & ఓవర్సీస్‌లో విడుదలై రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి.
Similar News
News February 13, 2025
నేడు పార్లమెంటు ముందుకు కొత్త ఐటీ బిల్లు

నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే భాష సరళీకరణంగా ఉండనుంది. కొత్త బిల్లులో 526 సెక్షన్లు ఉండనున్నాయి.
News February 13, 2025
కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్

TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.
News February 13, 2025
మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.