News September 29, 2024
రిలయన్స్@ రోజుకు రూ.216 కోట్ల ఆదాయం
FY2024లో ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు ₹216 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఆ తర్వాత వరుసగా SBI(₹187 కోట్లు), HDFC బ్యాంక్(₹179 కోట్లు), ONGC(₹156 కోట్లు), TCS(₹126 కోట్లు), ICICI బ్యాంక్(₹123 కోట్లు), IOC(₹118 కోట్లు), LIC(₹112 కోట్లు), కోల్ ఇండియా (₹102 కోట్లు), టాటా మోటార్స్(₹87 కోట్లు) ఉన్నాయి.
Similar News
News October 8, 2024
శ్రీవారి గరుడోత్సవం.. 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం నేడు జరగనుంది. దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో RTC బస్సులలో వారిని కొండపైకి తరలించేందుకు TTD అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టూవీలర్స్, టాక్సీలను కొండపైకి నిషేధించారు. కాగా గరుడు వాహన సేవ సా.6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగేలా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు.
News October 8, 2024
రేపు డబుల్ ధమాకా
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రేపు అరగంట వ్యవధిలో రెండు మ్యాచులు జరగనున్నాయి. సాయంత్రం 7 గంటలకు భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌తో రెండో టీ20 మ్యాచులో తలపడనుంది. మరోవైపు సా.7.30 గంటలకు మహిళా టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో టీమ్ ఇండియా ఆడనుంది. సెమీస్ చేరాలంటే మహిళల జట్టుకు ఈ మ్యాచులో గెలుపు చాలా కీలకం. కాగా బంగ్లాతో తొలి టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News October 8, 2024
కాంగ్రెస్ ఎన్నికల ఖర్చు రూ.585 కోట్లు
ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల(ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం) అసెంబ్లీ ఎన్నికలకు రూ.585 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ఈసీకి వివరాలను సమర్పించింది. యాడ్స్, మీడియా ప్రచారానికి రూ.410 కోట్లు, ఇతరత్రాలకు మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేసినట్లు తెలిపింది. కాగా కాంగ్రెస్ వద్ద డిపాజిట్ల రూపంలో రూ.170 కోట్లు ఉండగా వివిధ మార్గాల్లో రూ.539.37 కోట్లు వచ్చాయని పేర్కొంది.