News May 24, 2024
ఎన్నికల కేసుల్లో నిందితులైన నేతలకు ఊరట

AP: ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా YCP MLAలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, TDP నేతలు చింతమనేని ప్రభాకర్, అస్మిత్‌రెడ్డిలను జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ ఉన్నందున అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న పిటిషనర్ల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. వీరి కదలికలపై పోలీసులతో నిఘా ఉంచాలని ఈసీని కోర్టు ఆదేశించింది.
Similar News
News February 9, 2025
బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
News February 9, 2025
రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.
News February 9, 2025
SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్

SA20-2025 టైటిల్‌ను MI కేప్‌టౌన్ గెలుచుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.