News December 31, 2024
హరీశ్‌రావుకు ఊరట

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసులో జనవరి 9 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్ గతంలో దాఖలు చేసిన ఈ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. వాదనలకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణ వాయిదా వేశారు.
Similar News
News November 28, 2025
ఇలాంటి వరుడు అరుదు.. అభినందించాల్సిందే!

‘కట్నం అడిగినవాడు గాడిద’ అనే మాటను పట్టించుకోకుండా కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. అలాంటిది కట్నం వద్దంటూ తిరిగిచ్చాడో యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వరుడు కట్నం తీసుకునేందుకు నిరాకరించాడు. కొవిడ్ సమయంలో తండ్రిని కోల్పోయిన వధువు కుటుంబం రూ.31లక్షల కట్నం సిద్ధం చేసింది. ‘నాకు ఈ కట్నం తీసుకునే హక్కులేదు’ అని చెప్పి రూపాయి మాత్రమే స్వీకరించి ఔరా అనిపించాడు.
News November 28, 2025
ఐఐఎం విశాఖలో ఉద్యోగాలు

ఐఐఎం విశాఖపట్నం కాంట్రాక్ట్ ప్రాతిపదికన రీసెర్చ్ అసిస్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.30వేలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.iimv.ac.in
News November 28, 2025
‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు పాజిటివ్ టాక్ రావడంతో తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణలో రూ.4.35 కోట్లు వసూలు చేసింది. అటు ఓవర్సీస్లోనూ ఫస్ట్ డే 2,75,000 డాలర్స్ కలెక్ట్ చేసింది. రేపటి నుంచి వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి.


