News December 31, 2024

హరీశ్‌రావుకు ఊరట

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట దక్కింది. పంజాగుట్ట పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసులో జనవరి 9 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్ గతంలో దాఖలు చేసిన ఈ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. వాదనలకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో విచారణ వాయిదా వేశారు.

Similar News

News January 22, 2025

జనవరి 22: చరిత్రలో ఈ రోజు

image

1882: స్వాతంత్ర్య సమరయోధుడు అయ్యదేవర కాళేశ్వరరావు జననం
1918: కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంత శాఖ ఏర్పాటు
1940: తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి మరణం
1970: బోయింగ్ 747 వాడుకలోకి వచ్చింది
1972: సినీ నటి నమ్రత జననం
1989: సినీ నటుడు నాగశౌర్య జననం
2014: తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు(ఫొటోలో) మరణం

News January 22, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 22, 2025

దావోస్‌లో ప్రభుత్వం కీలక ఒప్పందాలు

image

TG: దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. మేఘా ఇంజినీరింగ్, ప్రభుత్వం మధ్య మూడు ఒప్పందాలు జరిగాయి. 2,160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం రూ.11వేల కోట్లతో ఒప్పందం జరిగింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం మరో రూ.3వేల కోట్లు, అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం రూ.1000 కోట్లతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.