News April 25, 2024
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్యకు ఊరట
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్‌కు భారీ ఊరట లభించింది. రూ.25వేల కోట్ల బ్యాంకు స్కామ్ కేసులో ఆమెకు ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆమె బ్యాంకు లావాదేవీలలో ఎలాంటి నేరం జరగలేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా సునేత్ర ప్రస్తుతం బారామతీ లోకసభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Similar News
News January 23, 2025
ఆ సెంటిమెంట్ వల్లే ఏపీకి నిధులు: కేంద్ర మంత్రి
AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆంధ్రుల సెంటిమెంట్‌ను గౌరవించి కేంద్రం ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. ఈ ప్యాకేజీ కింద రూ.11,440 కోట్లు కేటాయించామన్నారు. ‘ప్లాంట్‌ను కాపాడేందుకే ఈ ప్యాకేజీ ఇచ్చారు. భవిష్యత్‌లో మరో ప్యాకేజీ ఇస్తాం. స్టీల్ ప్లాంట్‌ను నష్టాల్లోంచి లాభాల్లోకి తీసుకొస్తాం. ఇక పరిశ్రమను కాపాడడానికి ఇంత మొత్తంలో ఇవ్వడం ఇదే తొలిసారి’ అని పేర్కొన్నారు.
News January 23, 2025
ప్రచారంలో ఉన్న లిస్టు ఫైనల్ కాదు: మంత్రి ఉత్తమ్
TG: సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయమై ప్రచారంలో ఉన్న లిస్టు తుది జాబితాలు కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది వెరిఫికేషన్ మాత్రమేనని తెలిపారు. కావాలనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. చివరి లబ్ధిదారుడి వరకు రేషన్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ 40వేల రేషన్ కార్డులు ఇచ్చిందని దుయ్యబట్టారు.
News January 23, 2025
అక్బర్, ఔరంగజేబు గురించి మనకెందుకు: అక్షయ్ కుమార్
దేశంలో చరిత్ర పుస్తకాలను మార్చాల్సిన అవసరం ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ హిస్టరీ బుక్స్‌లో అక్బర్, ఔరంగజేబు గురించి చదువుకోవడం అవసరమా అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన ‘స్కై ఫోర్స్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘చరిత్రలో దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల గురించి పాఠాలు ఉండాలి. పరమవీరచక్ర అవార్డు పొందిన వారి కథనాలు ప్రచురించాలి’ అని పేర్కొన్నారు.