News March 6, 2025
పోసాని కృష్ణమురళికి ఊరట

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయా కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది.
Similar News
News November 27, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2,268 పోలింగ్ కేంద్రాలు

జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోసం 260 పంచాయతీల్లో 2,268 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడత ఎన్నికలు జరిగే రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, చందుర్తి మండలాలలో 85, 2వ దశ ఎన్నికలు నిర్వహించే బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాల్లో 88, 3వ విడత ఎన్నికలు జరిగే ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాలలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
News November 27, 2025
హసీనా అప్పగింతపై పరిశీలిస్తున్నాం: భారత్

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. తీవ్ర నేరాలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.
News November 27, 2025
ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

ఈ కింద సూచించిన ఆకుకూరల రకాలు మన ప్రాంతంలో సాగుకు అనుకూలం. వీటిని సరైన యాజమాన్యాన్ని పాటిస్తూ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
☛ కొత్తిమీర: సిందు సాధన, స్వాతి, సుధా, సుగుణ, సురచి(LCC-234), APHU ధనియా-1 (వేసవి రకం), సుస్థిర
☛ కరివేపాకు: సువాసిని, భువనేశ్వర్, సెంకంపు
☛ మునగ: జాఫ్నా(ఇది బహువార్షిక రకం), పి.కె.యం-1( ఇది ఏక వార్షిక రకం)


