News March 6, 2025

పోసాని కృష్ణమురళికి ఊరట

image

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి హైకోర్టులో ఊరట దక్కింది. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో నమోదైన కేసుల్లో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. దీంతో ఆయా కేసుల్లో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం లేకుండా పోయింది.

Similar News

News March 26, 2025

రామ్ చరణ్ అభిమానులకు సూపర్ న్యూస్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘RC16’ సినిమా నుంచి అప్డేట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు అప్డేట్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. రేపు చరణ్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ వీడియో వచ్చే అవకాశం ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

News March 26, 2025

వాషింగ్టన్ సుందర్‌పై స్పందించిన గూగుల్ సీఈఓ

image

వాషింగ్టన్ సుందర్‌‌ను గుజరాత్ టైటాన్స్ తుది జట్టులోకి తీసుకోకపోవడంపై గూగుల్ CEO సుందర్ పిచాయ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా టీమ్‌లో ఉన్న సభ్యుడికి IPL తుది జట్టులో చోటు కల్పించరా అని ఒక అభిమాని Xలో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన సుందర్ పిచాయ్ నాకూ అదే ఆశ్చర్యంగా ఉందని రిప్లై ఇచ్చారు. GT-PBKS మధ్య జరిగిన మ్యాచులో పంజాబ్ జట్టు 243పరుగుల లక్ష్యాన్నినిర్దేశించగా GT స్వల్ప తేడాతో ఓడిపోయింది.

News March 26, 2025

Stock Markets: మీడియా, హెల్త్‌కేర్ షేర్లు కుదేలు

image

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, రెసిస్టెన్సీ స్థాయి వద్ద అమ్మకాల సెగతో స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మిడ్ సెషన్లో నిఫ్టీ 23,604 (-65), సెన్సెక్స్ 77,696 (-320) వద్ద చలిస్తున్నాయి. మీడియా, హెల్త్‌కేర్, ఫార్మా, బ్యాంకు, ఫైనాన్స్, చమురు, ఐటీ, రియాల్టి షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. ఇండస్‌ఇండ్, ట్రెంట్, ఎం&ఎం, BEL, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. TECH M, NTPC, యాక్సిస్, సిప్లా టాప్ లూజర్స్.

error: Content is protected !!