News December 31, 2024

రాబిన్ ఉతప్పకు రిలీఫ్: అరెస్టు నుంచి రక్షణ కల్పించిన హైకోర్టు

image

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు భారీ ఊరట లభించింది. EPF డిపాజిట్ల అక్రమాల కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా కర్ణాటక హైకోర్టు వెకేషన్ బెంచ్ అతడికి రక్షణ కల్పించింది. సెంటారస్ బ్రాండ్స్‌లో 2018-2020 వరకు ఉతప్ప డైరెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగుల వేతనాల్లోంచి కత్తిరించిన రూ.23.36 లక్షలను పీఎఫ్ అకౌంట్లలో కంపెనీ జమ చేయలేదు. దీంతో ఉతప్ప సహా మిగిలిన వారికి EPFO అధికారులు నోటీసులు పంపించారు.

Similar News

News January 25, 2025

రోహిత్‌కు గాయమైతే భారత్‌కు సమస్యే: అశ్విన్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడితే భారత జట్టు కష్టాల్లో పడుతుందని మాజీ క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ గాయపడితే వైస్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్ కెప్టెన్సీ చేయాలి. కానీ అతడికి అనుభవం లేదు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. రోహిత్, కోహ్లీ, బుమ్రా లేకపోతే టీమ్‌ని నడిపించే వాళ్లెవరూ కనిపించడం లేదు. టీమ్ ఇండియాలో సమర్థమైన కెప్టెన్‌ల కొరత ఉంది’ అని తన యూట్యూబ్ వీడియోలో వివరించారు.

News January 25, 2025

మీర్‌పేట్ ఘటన.. పోలీసులకు సవాల్

image

HYDలో భార్యను నరికి ముక్కలుగా ఉడికించిన <<15250914>>కేసు <<>>దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. నిందితుడు చెప్పినట్టు మృతదేహాన్ని బూడిదగా మార్చి చెరువులో వేసినట్లైతే అది నిరూపించడం, ఘటనా స్థలంలో దొరికిన శాంపిల్స్ ల్యాబ్‌కు పంపి అవి మనిషివని నిరూపించడం పెద్ద టాస్కే. అది మాధవి శరీరమని నిరూపించేలా ఆమె పేరెంట్స్, పిల్లల DNA శాంపిల్స్ విశ్లేషించాలి. ఇందుకోసం టాప్ ప్రొఫెషనల్స్‌ను పోలీసులు సంప్రదిస్తున్నారు.

News January 25, 2025

‘తండేల్’ ట్రైలర్ ఎప్పుడంటే?

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న ‘తండేల్’ మూవీ ట్రైలర్ ఈ నెల 28న రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ‘దేశం కోసం, ప్రజల కోసం, సత్య కోసం అతని ప్రేమ’ అంటూ రాసుకొచ్చింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సహా మూడు సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కానుంది.