News October 4, 2024

హైకోర్టులో సజ్జలకు ఊరట

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని సజ్జలను ఆదేశించింది. కేసుపై విచారణను ఈనెల 25కి వాయిదా వేసింది.

Similar News

News March 18, 2026

సంచలనం.. డ్రగ్స్ మాఫియాతో రోహిత్ రెడ్డికి లింక్?

image

TG: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ మాఫియాతో BRS మాజీ MLA పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆయన సూచనతో డ్రైవర్ శరత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అభిషేక్ సింగ్ వద్ద డ్రగ్స్ కొన్నట్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో అభిషేక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్‌లపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి.

News March 18, 2026

74 మంది ఎమ్మెల్యేలకు TMC షాక్

image

W.బెంగాల్ CM మమత 74మంది సిట్టింగ్ MLAలకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం పార్టీకున్న MLA(223)లలో ఇది 3వ వంతు కావడం గమనార్హం. 3పర్యాయాలుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక నిన్న ప్రకటించిన 291మంది అభ్యర్థుల్లో 135మంది సిట్టింగ్ MLAలు ఉండగా, 15మంది స్థానాలు మారాయి. WBలో APR 23, 29 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

News March 18, 2026

పితృత్వ సెలవులు ఇవ్వాలి: సుప్రీంకోర్టు

image

దేశంలోని ఉద్యోగులందరికీ పితృత్వ సెలవులు వర్తించే విధంగా చట్టం తేవాలని SC అభిప్రాయపడింది. దత్తతలో <<19406877>>మాతృత్వ<<>> సెలవులపై విచారణ సందర్భంగా ఈ కామెంట్స్ చేసింది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తండ్రుల పాత్ర కీలకమని, నవజాత శిశువులకు నాన్న మాటలు, స్పర్శ ఎంతో అవసరమని పేర్కొంది. పిల్లల పెంపకం ఏ ఒక్కరి పనో కాదని, వారి బాధ్యతను సమానంగా పంచుకోవాలంది. కాగా ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఉద్యోగులకు ఇది అమల్లో ఉంది.