News May 26, 2024
రెమాల్ తుఫాన్: లక్షమంది సురక్షిత ప్రాంతాలకు..!

పశ్చిమ బెంగాల్ వైపు రెమాల్ తుఫాను ముంచుకొస్తోంది. ఈరోజు అర్ధరాత్రి సమయానికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తీరప్రాంతాల్లోని 1.10లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ముప్పు ఎక్కువగా ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో ప్రజలకు నిత్యావసర సరుకులు, 5.40 లక్షల టార్పాలిన్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 10, 2025
శ్రీ సత్యసాయి, అనంతలో ‘స్క్రబ్ టైఫస్’ కలకలం

కలకలం సృష్టిస్తున్న స్క్రబ్ టైఫస్ అనంత జిల్లాకూ పాకింది. రాయదుర్గం సమీపంలోని తాళ్లకెరకు చెందిన బాలిక జ్వరంతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా రక్తపరీక్షలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి(D) ముదిగుబ్బ మండలానికి చెందిన గర్భిణి ప్రసవం నిమిత్తం చేరారు. జ్వరం ఉండటంతో ఆమెకూ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 2 రోజుల క్రితం హిందూపురంలో ఓ మహిళకు స్క్రబ్ టైఫస్ సోకింది.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.


