News May 26, 2024

రెమాల్ తుఫాన్: లక్షమంది సురక్షిత ప్రాంతాలకు..!

image

పశ్చిమ బెంగాల్‌ వైపు రెమాల్ తుఫాను ముంచుకొస్తోంది. ఈరోజు అర్ధరాత్రి సమయానికి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా తీరప్రాంతాల్లోని 1.10లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ముప్పు ఎక్కువగా ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో ప్రజలకు నిత్యావసర సరుకులు, 5.40 లక్షల టార్పాలిన్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 16, 2025

భారత్‌కు వారసులు హిందువులే: మోహన్ భాగవత్

image

దేశంలో హిందూ సమాజమే బాధ్యతాయుతమైనదని RSS చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందనే సత్యాన్ని హిందువులు విశ్వసిస్తారన్నారు. బెంగాల్‌లో మాట్లాడుతూ భారత్‌కు వారసులు హిందువులేనని పేర్కొన్నారు. ‘పాలకులు, మహారాజులను దేశం గుర్తుంచుకోదు. కానీ తండ్రి మాటకు కట్టుబడి 14ఏళ్ల వనవాసం చేసిన రాజును, సోదరుడి చెప్పులతో పాలన చేసిన వ్యక్తిని గుర్తుంచుకుంటుంది’ అని తెలిపారు.

News February 16, 2025

నెక్స్ట్ టార్గెట్ కొడాలి, పేర్ని నానిలే: మంత్రి కొల్లు

image

AP: వైసీపీ నేతలు చేసిన పాపాలే వారిని జైలుపాలు చేస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారని విమర్శించారు. ‘నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది కొడాలి నాని, పేర్ని నానిలే. వైసీపీ హయాంలో వీరిద్దరూ అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. వీటిపై విచారణ చేసి వీరిని జైలుకు పంపుతాం’ అని ఆయన హెచ్చరించారు.

News February 16, 2025

ప్రభాస్ లేటెస్ట్ PHOTO చూశారా?

image

రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ ఫొటో వైరలవుతోంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభాస్‌ను కలిసి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ ఫొటోను షేర్ చేస్తూ లాంగ్ హెయిర్‌లో డార్లింగ్ లుక్ అదిరిపోయిందని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల్లో ప్రభాస్ నటిస్తున్నారు.

error: Content is protected !!