News August 7, 2024
ఏపీలో 35 లక్షల జాబ్ కార్డుల తొలగింపు
ఏపీలో ఐదేళ్ల వ్యవధిలో 35,54,193 గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులను తొలగించినట్లు కేంద్ర సహాయ మంత్రి కమలేశ్ పాస్వాన్ తెలిపారు. అదే సమయంలో దేశవ్యాప్తంగా 4.43 కోట్ల కార్డులు తొలగించినట్లు పేర్కొన్నారు. కార్డుల తనిఖీలు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతాయన్నారు. డూప్లికెట్ కార్డులు, ఉపాధి హామీ పని చేసేందుకు ఆసక్తి లేకపోవడం, గ్రామపంచాయతీల నుంచి వెళ్లి పోవడం, మరణాలు వంటి కారణాలతో రద్దు చేసి ఉంటారని చెప్పారు.
Similar News
News September 19, 2024
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,690 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,086 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు చేకూరింది.
News September 19, 2024
జమిలి ఎన్నికలు: రాజ్యాంగ సవరణలకు ఎంత బలం అవసరం?
జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలకు పార్లమెంటులో 2/3 వంతు సభ్యుల ఆమోదం అవసరం. NDAకి ప్రస్తుతం ఉన్న మద్దతు ఏ మాత్రం సరిపోదు. అదనంగా సభ్యుల మద్దతు కూడగడితే తప్పా ఈ సవరణలు ఆమోదం పొందే పరిస్థితి లేదు. లోక్‌సభలో NDAకు 293 మంది సభ్యుల బలం ఉంటే, సవరణల ఆమోదానికి 362 మంది మద్దతు అవసరం. ఇక రాజ్యసభలో 121 మంది బలం ఉంటే, అదనంగా 43 మంది సభ్యుల బలం అవసరం ఉంది.
News September 19, 2024
జమిలి ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు
లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, 83(2) *అసెంబ్లీల గడువు కుదింపునకు ఆర్టికల్ 172 (1) *రాష్ట్రపతి పాలనకు వీలుకల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషన్ పరిధికి సంబంధించి ఆర్టికల్ 324 *లోక్‌సభ, అసెంబ్లీల ముందస్తు రద్దుకు రాష్ట్రపతి, గవర్నర్‌కు అధికారం కల్పించే ఆర్టికల్ 83(2), 172(1)ను సవరించాలి. ఈ సవరణలు ఆమోదం పొందితే తప్పా జమిలి ఎన్నికలు సాధ్యం కావు.