News October 18, 2024
జేఈఈ మెయిన్‌లో ఆప్షనల్ క్వశ్చన్స్ ఎత్తివేత
జేఈఈ మెయిన్ నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇక నుంచి సెక్షన్ Bలో ఆప్షనల్ క్వశ్చన్స్ ఉండవని వెల్లడించింది. కరోనా సమయంలో విద్యార్థులకు రిలీఫ్ ఇచ్చేందుకు 2021లో ఛాయిస్ విధానాన్ని తెచ్చింది. సెక్షన్ Bలో 10 ప్రశ్నలకు ఐదింటికి ఆన్సర్స్ రాయాల్సి ఉండేది. 2024 వరకు దీన్ని కొనసాగించారు. 2025 నుంచి 5 క్వశ్చన్సే ఇస్తామని, అవన్నీ రాయాల్సి ఉంటుందని వివరించింది.
Similar News
News November 5, 2024
రెండేళ్ల బిడ్డ కోసం 43 ఏళ్లుగా వెతుకులాట!
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల కూతురు కాట్రిస్ లీ 43 ఏళ్ల క్రితం జర్మనీలోని బ్రిటిష్ మిలిటరీ సూపర్ మార్కెట్‌లో తప్పిపోయింది. ఇప్పటికీ ఆమె జాడ కోసం తండ్రి ఆర్మీ వెటరన్ రిచర్డ్ వెతుకుతూనే ఉన్నారు. ప్రతి ఏటా కాట్రిస్ తప్పిపోయిన ప్రదేశానికి వెళ్లి వస్తుంటారు. పోలీసులు సైతం వారికి హెల్ప్ చేస్తున్నారు. రిచర్డ్‌కు 75 ఏళ్లు కాగా తాను చనిపోయేవరకూ బిడ్డ కోసం వెతకడం ఆపనని ఆయన చెబుతున్నారు.
News November 5, 2024
Stock Market: బుల్ జోరు కొనసాగింది
బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మెటల్ రంగ షేర్లకు మంగళవారం కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకుపోయాయి. సెన్సెక్స్ 694 పాయింట్ల లాభంతో 79,476 వద్ద, నిఫ్టీ 217 పాయింట్ల లాభంతో 24,213 వద్ద స్థిరపడ్డాయి. 78,300 పరిధిలో సెన్సెక్స్‌కు, నిఫ్టీకి 23,850 పరిధిలో కీలక మద్దతు లభించింది. JSW Steel 4.5%, Tata Steel 3.7% లాభపడ్డాయి. Trent 1.7%, Adni Ports 1.5% మేర నష్టపోయాయి.
News November 5, 2024
సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య: సల్మాన్ మాజీ ప్రేయసి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని ఆరోపించారు. దీనికి నటి జియా ఖాన్ విషాదాంతాన్ని ఉదహరించారు. జియా గర్భవతిగా ఉన్నప్పుడు ఉరివేసుకొని కనిపించిందని, ఆమె మరణం తర్వాత సల్మాన్ సలహాలను సూరజ్ పంచోలీ కోరారని ఆరోపించారు. సల్మాన్ కంటే సీరియల్ కిల్లర్ టెడ్ బండీ నయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.