News August 3, 2024
అమరావతిలో పర్మిషన్ లేని లేఅవుట్ల తొలగింపు
AP: రాజధాని అమరావతిలో ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లను CRDA తొలగించింది. తాడికొండ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ కోసం పంట పొలాలను ప్లాట్లుగా మార్చారు. దీంతో అధికారులు లేఅవుట్ల కంచెలను, హద్దు రాళ్లను తొలగించారు. అనుమతులు, నాలా పన్నులు చెల్లించకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.
Similar News
News September 12, 2024
ఏ వయసు వారు ఎంతసేపు నిద్రపోవాలంటే?
* అప్పుడే పుట్టిన పిల్లలు: 18 గంటలు
* 4-11 నెలల చిన్నారులు: సుమారు 15 గంటలు
* 3-5 ఏళ్ల పిల్లలు: 13 గంటలు
* 6-12 ఏళ్ల పిల్లలు: 9-12 గంటలు
* 13-18 ఏళ్ల వారు: కనీసం 8 గంటలే
* 18-60 ఏళ్ల వారు: 7-9 గంటలు
* 60 ఏళ్లు పైబడినవారు: 7-8 గంటలు
** లేదంటే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయి.
News September 12, 2024
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
పెన్షన్ల జారీలో ఆలస్యంతో ఉద్యోగుల ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ విభాగం ఈ మేరకు ఆఫీస్ మెమోరాండం జారీ చేసింది. CSS రూల్ 2021లో పేర్కొన్నట్లు నిర్ణీత కాలంలో పెన్షన్ మంజూరు ప్రక్రియ పూర్తి చేయాలంది.
News September 11, 2024
మండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి
తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ బులిటెన్ జారీ చేశారు. ఈ ఏడాది జులై 25న మండలిలో బీఆర్ఎస్ పక్ష నేతగా మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ అందించారు.